బాబు అవినీతిమయం అని రోజా విమర్శలునంద్యాల గడ్డ వైఎస్ ఆర్ అడ్డ .బాబు పాలనకు అంతం పలకాలని ప్రజలకు పిలుపు

నంద్యాల ఉప ఎన్నీక‌ల ప్ర‌చారం హోరా హోరిగా సాగుతుంది, ఇటు ప్ర‌ధాన పార్టీ టిడిపి, మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపి రెండు గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతున్నాయి. అందులో భాగంగా వైసీపి నేడు నంద్యాల‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. అందులో వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ పాల్గోన్నారు.

 ఈ కార్య‌క్ర‌మం లో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ నంద్యాల ప్ర‌జ‌లు దివంగ‌త‌ మాజీ ముఖ్య‌మంత్రి రాజశేఖ‌ర్ రెడ్డిని గుర్తు చేసుకోవాలన్నారు. ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు అంద‌రికి ఉన్న‌త విద్య‌ను ఉచితంగా తీసుకొచ్చారని పెర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు రెండు రూపాయ‌ల‌కు బియ్యం, రైతులు ఉచిత‌ క‌రెంట్ అందించిన గొప్ప నేత వైఎస్ఆర్ అని ఆమె తెలిపారు. అంతేకాదు నంద్యాల గ‌డ్డ అంటే వైఎస్ఆర్ అడ్డ అని ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపారు.


నంద్యాలలో ప్ర‌జ‌ల‌కు మూడు సంవ‌త్స‌రాల్లో బాబు చేసింది ఎమీ లేద‌ని ఆమె ఆరోపించారు. చంద్ర‌బాబు పార్టీకి ఓటు వేస్తు అవినీతికి ఓటు వేసిన‌ట్లేన‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. బాబు హాయాంలో అవినీతి త‌ప్ప మ‌రోక‌టి లేదని అమె ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నీక‌లు 5 కోట్ల త‌ల‌రాత‌ను మార్చే ఎన్నీక‌లుగా ఆమె చిత్రిక‌రించారు.