ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ప్రజల సొమ్మును చంద్రబాబు అడ్డగోలుగా లూటీ చేశారంటూ ఆరోపించారు.

AlsoRead డబ్బులు లేవు సార్ .. ఇటుక ఇస్తున్నా..

‘‘ చంద్రబాబు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల’ కథను గుర్తు కొస్తోంది. తుఫాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?’’ అంంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో ‘‘ చంద్రబాబు  స్వభావం మొదటి నుంచి అంతే. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి.’’ అంటూ మరో ట్వీట్ చేశారు.