Asianet News TeluguAsianet News Telugu

‘సార్.. మీరు బీజేపీలో ఉన్నారు.. టీడీపీలో కాదు’, పప్పులో కాలేసిన టీజీ

తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అని సవరించుకోవాలని సూచించారు. కుదరక, మళ్లీ మొదటి నుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని తొలినుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై సానుకూలంగా స్పందించారు.

MP TG Venkatesh Did A Mistake While Talking To Media
Author
Hyderabad, First Published Feb 4, 2020, 8:25 AM IST

రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే... పార్టీ మారినా... ఆయన ఇంకా టీడీపీ ని మనసులో నుంచి తీసేసినట్లు లేరు. మీడియా సమావేశంలో... బీజేపీ పేరు తలవాల్సిన స్థానంలో టీడీపీ పేరు ఎత్తారు. దీంతో... దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ సమయంలో ఆయన నోరు జారారు. మా టీడీపీ అంటూ మాట్లాడటం ప్రారంభించారు. గమనించిన మీడియా ప్రతినిధులు సార్.. మీరు బీజేపీలో ఉన్నారు అని చెప్పగానే ఆయన తన పొరపాటును సరిదిద్దుకోవడం గమనార్హం.

Also Read నారావారిపల్లెలో వైసీపీ సభ: చంద్రబాబు స్పందన ఇదీ...

తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అని సవరించుకోవాలని సూచించారు. కుదరక, మళ్లీ మొదటి నుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని తొలినుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై సానుకూలంగా స్పందించారు.

మూడు ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, వాటి బ్రాంచులు ఉండాలన్న నిర్ణయాన్ని సమర్థించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డైనమిక్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. 

‘నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం’ అందుకే అందరి కోసం మూడు రాజధానులుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణకు టీజీ వెంకటేష్‌ ఇదివరకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios