బాధ్యతలు లేని వ్య‌క్తుల‌ను ఊరు మీదకు వ‌దిలారు.. జ‌గ‌న్ పై ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫైర్

Visakhapatnam: విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్..  వరలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటన పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.. ముఖ్య‌మ‌త్రి జ‌గ‌న్, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.
 

MP Raghurama Krishnaraju's comments on volunteer system. Criticism of Jagan's government RMA

MP Raghurama Krishnaraju: విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్.. వరలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటన పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.. ముఖ్య‌మ‌త్రి జ‌గ‌న్, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. సుజాత‌న‌గ‌ర్ లో వరలక్ష్మి వృద్ద‌ మహిళలను వలంటీర్ హత్య చేశాడని పేర్కొంటూ.. ఎలాంటి బాధ్యతలు లేని వారిని ఊరు మీదకు.. ఇంటి మీదకు ముఖ్య‌మంత్రి జగన్ వదిలేశారని రఘురామ కృష్ణ‌రాజు విమ‌ర్శించారు.

వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై మండిప‌డుతూ.. ''ఇది దుష్ట‌పు ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్రపు ఆలోచన ద్వారా వచ్చిన ఏదైనా ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థ అని చెప్పడానికి నేనేమీ వెనుకాడను. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుడిగా నేను నా భావాన్ని తెలియ‌జేస్తున్నాను. గతంలో చెప్పింది మరొక్కసారి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.. నేరుగానే ఫించ‌న్ల‌ను ల‌బ్దిదారుల ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు క‌దా'' అని పేర్కొన్నారు. అలాగే, ‘వలంటీర్ చేస్తున్న పని ఏంటి ? అని ప్ర‌శ్నిస్తూ.. పింఛన్ వార్డు మెంబర్ కూడా ఇవ్వొచ్చు లేదంటే అకౌంట్‌లో వేయవచ్చని అన్నారు. ఒక ఇంటి నంబర్ పై 500 వందల దొంగ ఓట్లు నమోదు చేశార‌నీ, అసలు దొంగ ఓట్లు ఉన్నవారి పేరు మీద ఉన్న పించన్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందని ప్ర‌శ్నించారు. 

వాలంటీర్లు వివ‌రాల‌ను సేక‌రించడాన్నిడేటా చౌర్యంగా అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలంటే ఎవరెవరికి కనెక్షన్లు ఉన్నయనే వివరాలు సేకరిస్తారా ? ఏంటీ ఈ దరిద్రపు ఆలోచన అంటూ మండిప‌డ్డారు. నాలుగు ల‌క్షల ప‌ద‌హారు వేల జీరో గృహాలు ఉన్నాయ‌నీ, వాటిల్లో రెండు ల‌క్ష‌ల మంది పింఛ‌నుదారులు ఉంటే.. ఏమీ లేకున్నా ఇంటికి ఒక ఫించ‌నుదారుని వేసుకున్నా వ‌చ్చే డ‌బ్బును తినేస్తున్నారు క‌దా? అంటూ ఆరోపించారు. వ‌చ్చే డ‌బ్బును వాంటీర్లు లేపుతున్నారా?  లేక ప్ర‌భుత్వ పెద్ద‌లు లేపుతున్నారా? అంటూ ప్ర‌శ్నించారు. అలాగే, ఈ వాలంటీర్ల ఓట్లు త‌న‌కు అక్క‌ర‌లేద‌నీ, ప్ర‌జా మ‌ద్ద‌తు త‌న‌కు ఉంద‌ని ర‌ఘురామ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫును పోటీ చేసేది లేద‌నీ, ఎవ‌రినీ తిసుకువ‌చ్చినా తుక్కుతుక్కుగా ఓడిస్తానంటూ ధీమా వ్య‌క్తంచేశారు.  

''పంచాయితీ వ్యవస్థ ఉండగా, వార్డు మెంబ‌ర్లు ఉండగా, స‌ర్పంచులుఉండగా,  వలంటిరీ వ్యవస్థ ఎందుకు? తీసేయండి. వారికి టెక్నీక‌ల్ ఎడ్యుకేష‌న్ ఇవ్వండి.. ఉపాధి క‌ల్ప‌న ఇవ్వండి. ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురండి. రాష్ట్రంలోని రాజ‌కీయ‌ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వలంటరీ వ్యవస్థ వద్దు. నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ మ‌న‌కు ముఖ్యమ‌ని'' పేర్కొన్నారు. ఈ క్యాన్స‌ర్ లాంటి వ్య‌వ‌స్థ‌ను మ‌నం వ‌దిలించుకోవాల‌ని రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios