ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు కలవనున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు కలవనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం వారు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వారు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. అయితే తన భార్య, కొడుకుల కిడ్నాప్ వ్యవహారం తర్వాత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. జగన్‌తో సమావేశం కానుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని వ్యాపార భాగస్వామి జి వెంకటేశ్వరరావు అలియాస్ జీవీల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భూ దందాల లావాదేవీల్లో తేడాలతో కిడ్నాప్ డ్రామా చోటుచేసుకుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని.. అప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
