విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నాయకుడు మోకా భాస్కర రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కొల్లు రవీంద్ర పెట్టుకున్నబెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. మోకా భాస్కర రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నాలుగో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

ఈ ఏడాది జూన్ 30వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకు గురయ్యారు. భాస్కర్ రావు హత్య కేసులోని నిందితులతో కొల్లు రవీంద్ర మాట్లాడారని, భాస్కర్ రావు హత్యలో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని పోలీసులు ఆరోపించారు. 

Also Read: కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు: తీర్పు రేపటికి వాయిదా

కొల్లు రవీంద్రను అక్రమంగా అరెస్టు చేశారని అప్పట్లో చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ నేతలు ఆరోపించారు. రాజకీయపరమైన, కులపరమైన ఆధిపత్య పోరులో భాగంగానే భాస్కర రావును హత్య చేశారని అప్పట్లో ఎస్పీ రవీంద్ర బాబు చెప్పారు ఏం జరిగినా తాను చూసుకుంటానని, భాస్కరరావును చంపాలని కొల్లు రవీంద్ర చెప్పారని ఆయన చెప్పారు. 

కొల్లు రవీంద్ర ప్రోద్బలం వల్లనే ప్రత్యర్థులు భాస్కర రావును హత్య చేశారని ఆయన చెప్పారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడు కూడా నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ చెప్పారు 

Also Read: ఎస్పీ ఎదుటే ఆ వైసిపి నేత హత్యకు కుట్ర జరిగిందా?: టీడీపీ అధికార ప్రతినిధి

హత్య జరిగిన పది నిమిషాల తర్వాత నిందితుల్లో ఒక్కడైన నాంచారయ్య ఫోన్ చేసి కొల్లు రవీంద్రతో మాట్లాడాడని, పని అయిపోయిందని నాంచరయ్య చెప్పాడని, జాగ్రత్తగా ఉండాలని కొల్లు రవీంద్ర చెప్పారని ఎస్పీ వివరించారు.