విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం నాడు ముగిశాయి.  బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను విన్న జడ్జి తీర్పును మంగళవారంనాటికి వాయిదా వేశారు. కోర్టు బెయిల్ ఇస్తోందా ఇవ్వదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

ఈ ఏడాది జూన్ 30వ తేదీన మచిలీపట్టణంలో వైసీపీ నేత మోకా భాస్కర్ రావును ప్రత్యర్థులు హత్య చేశారు. భాస్కర్ రావును హత్య చేసిన నిందితులతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారని కృష్ణా జిల్లా ఎస్పీ గతంలోనే ప్రకటించారు. నిందితులతో కొల్లు రవీంద్ర మాట్లాడినట్టుగా ఆధారాల ఆధారంగానే అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఆయనను ఏ4 నిందితుడిగా చేర్చారు పోలీసులు

ఈ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో కొల్లు రవీంద్ర  రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ కోసం ఆయన జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కొల్లు రవీంద్ర న్యాయవాదితో పాటు డిఫెన్స్ తరపు న్యాయవాది వాదనలను సోమవారం నాడు కోర్టుకు తెలిపారు.ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.

మరో వైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.