తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్‌బై చెప్పారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె అవసరమైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సునీత స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సునీత పాటుపడుతున్నారని ఆమె ప్రశంసించారు. 

ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఓటింగ్ విషయంలో టీడీపీ నాయకత్వానికి షాకిచ్చింది ఎమ్మెల్సీ పోతుల సునీత. పోతుల సునీతతో పాటు టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడ టీడీపీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేశారు.

Also Read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై  అనర్హత వేటు వేయాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌కు లేఖ అందించారు టీడీపీ సభ్యులు. దివంగత టీడీపీ నేత పరిటాల రవికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న పోతుల సురేష్ భార్యే సునీత.

శాసనమండలికి విధిగా హాజరుకావాలని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని విప్ జారీ చేసింది. అయితే టీడీపీ ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శమంతకమణిలు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణంగానే శమంతకమణి శాసనమండలి సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా చెబుతోంది.

Also Read:మండలి రద్దు ఖాయం: వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు

ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని మానవపాడు మండలం శాంతినగర్‌‌లో పోతుల సునీత నివాసం ఏర్పాటు చేసుకొంది.  మాజీ మంత్రి పరిటాల రవికి సన్నిహితుడుగా పేరున్న పోతుల సురేష్ భార్యే పోతుల సునీత.

సుధీర్ఘ కాలం పాటు టీడీపీతో  ఉన్న అనుబంధాన్ని వీడి వైసీపీలో చేరాలని పోతుల కుటుంబం ఎందుకు నిర్ణయం తీసుకొందనేది  తెలియాల్సి ఉంది.