టీజీ వెంకటేష్ కి కౌంటర్ ఇచ్చిన ఎస్వీ మోహన్ రెడ్డి

MLA sv mohan reddy counter to TG venkatesh
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్‌ ప్రకటించారన్నారు. రాజకీయాల్లో లోకేష్‌ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని స్పష్టం చేశారు.

కర్నూలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇటీవల లోకేష్ బహిరంగ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై టీజీ చేసిన కామెంట్స్ కి  ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్ వేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్‌ ప్రకటించారన్నారు. రాజకీయాల్లో లోకేష్‌ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని స్పష్టం చేశారు.

ఎమ్మిగనూరులో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డేనని లోకేష్‌ ప్రకటించినట్లు ఎస్వీ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. 

గతంలో టీజీ వెంకటేష్‌కు ఎంపీ పదవి, తనకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, ఈ విషయంలో తాను ఎవరిని హిప్నటైజ్‌ చేయలేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని, పార్టీ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.టీజీ కి టికెట్ దక్కకపోవడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

loader