చంద్రబాబు,ఆయన మంత్రివర్గాన్ని విమర్శించిన రోజా. మహిళ‌ల‌ను హింసించే వారిని చంద్రబాబు వెనుకేసుకొస్తున్నారు. మ‌హిళ సాధికార‌త కు చిత్త‌శుద్ది లేదన్న రోజా.

బ్రిటీష్ కాలంలో కూడా మ‌హిళ‌ల పై జ‌ర‌గ‌ని దౌర్జ‌న్యాలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హాయాంలో జ‌రుగుతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు వైసీపి ఎమ్మేల్యే రోజా. తెలుగు దేశంలో ఉన్న కొంద‌రు మంత్రులు మ‌హిళ‌ల ప‌ట్ట కాల‌కేయుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని రోజా విమ‌ర్శించారు. ఓ ఉత్త‌రాంద్ర మంత్రి పెడుతున్న బాధ‌లు త‌ట్టుకోలేక ఐఎఎస్ అధికారిణి కూడా కేంద్రానికి పిర్యాదు చేసిన‌ట్లుగా రోజా తెలిపారు. 


విజ‌య‌వాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన రోజా, చంద్ర‌బాబు, ఆయ‌న మంత్రి వ‌ర్గం పై ఫైర్ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌హిళ‌లు చాలా అభ‌ద్ర‌త‌భావంతో ఉన్నార‌ని ఆమె పెర్కొన్నారు. అంద‌కు కార‌ణం తెలుగు దేశం పార్టీ నేత‌ల‌ని విమ‌ర్శించారు. అస్సలు టిడిపి పార్టీ నాయ‌కుల‌కు రక్ష‌బంధ‌న్ శుభాకాంక్ష‌లు చెప్పే అర్హ‌త లేద‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో మ‌హిళ‌ల‌పై ఎక్క‌డ లేనంతా అఘాయిత్యాలు ఆంధ్రలో మ‌హిళ‌ల పై జ‌రుగుతున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు. అందుకు కేంద్ర తాజాగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నగా పెర్కోన్నారు. దేశంలో ఉన్న న‌లుగురు రాజ‌కీయ నాయ‌కులు మ‌హిళ‌ల పై అఘాయిత్యాలు పాల్ప‌ప‌డిన నాయ‌కుల జాబితాను విడుద‌ల చేసింద‌ని అన్నారు. అందులో ఇద్ద‌రు బాబు క్యాబినేట్ లో ఉన్న‌ట్లు రోజా పెర్కోన్నారు. ఆంధ్ర‌లో ఐపీఎస్ అధికారిణి పై ఓ మంత్రి అస‌భ్య ప‌ద‌జాలంతో ఎస్ఎమ్ఎస్‌లు పెడుతున్న‌ట్లు బాబుకి పిర్యాదు చేసిన ప‌ట్టించుకోలేద‌ని, అందు ఆమె కేంద్రం వ‌ద్ద త‌మ స‌మ‌స్య‌పై పిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు.