Asianet News TeluguAsianet News Telugu

చీఫ్ విప్ చింతమనేని, ఎమ్మార్వో వనజాక్షి చేతులు కలిపారు

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో నాకు ఆస్తుల గొడవేమీ లేదు. మేం దాయాదులం కాదు. విధి నిర్వహణలో ఆ రోజు జరిగినది దురదృష్టకర సంఘటన .  వాటి గురించి మర్చిపోవడమే మంచిది : వనజాక్షి

MLA chintamaneni and MRO vanajakshi  are friends now

దెందులూరుశాసనసభ్యులుప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, కృష్ణాజిల్లా నూజివీడు తహశీల్దారు వనజాక్షి  ఎవరో అందరికీ బాగా తెలుసు. మొన్న మొన్నటి దాకా వాళ్లు బద్ధ శత్రువులు. వాళ్లిద్దరి మధ్య తమ్మిలేరు  అక్రమ ఇసుక రవాణా గొడవ మొదలయి రాష్ట్ర మంతా వ్యాపించింది అసెంబ్లీలో చర్చ జరిగింది. చింతమనేని దౌర్జన్యం జాతీయ వార్త అయింది. ప్రతిపక్షాలు తెలుగుదేశాన్ని ఉతికి  ఆరేసేందుకు చింతమనేని వనజాక్షి మీద చేసిన దాడిని వాడుకున్నారు,. తెలుగుదేశం ఎమ్మెల్యే దౌర్జన్యానికి మారు పేరయ్యారు. ఇపుడు కథ మారిపోయింది.  చీఫ్ ప్రభాకర్, ఎమ్మార్వో వనజాక్షి మంచి ఫ్రెండ్స్, ఇలా  షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు,చూశారా.

 

అయితే,  గురువారం ఈ అనుకోని  కలయిక జరిగింది.

 

దెందులూరుబాల సదనంలోని బంకపల్లి మేఘన  అనే బాలిక కష్టాల మీద ఒక కధనం మీడియాలో ప్రముఖంగా వచ్చింది కధనం చూసిన వనజాక్షి వారి మీత్రులు అ బాలిక సంరక్షణ బాధ్యతలు తీసుకోవలని నిశ్చయించారు ఈ సందర్భంగా దెందులూరు వచ్చి బాలికను దత్తత తీసుకోవడానికి వచ్చిన వనజాక్షి, చింతమనేని ఒకే వేదికపై కలుసుకున్నారు. 


ఈ సందర్భంగా ఇద్దరు కరచాలనం చేసుకోవడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. 


ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ధ్వేషభావం లేదన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందిస్తానన్నారు.


 వనజాక్షి మాట్లాడుతూ ప్రభాకర్‌తో తనకు ఆస్తుల గొడవేమీ లేదని, తామేమీ దాయాదులం కాదని, విధి నిర్వహణలో ఆ రోజు జరిగినది దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. 
వాటి గురించి మర్చిపోవడమే మంచిదన్నారు. అనంతరం తహశీల్దారు వనజాక్షిని చింతమనేని తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. 


ప్రస్తుతం సమయం లేదని మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని తహశీల్దారు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios