టీడీపీ నేతలకు బాలకృష్ణ సీరియస్ వార్నింగ్

First Published 8, Jun 2018, 12:16 PM IST
MLA balakrishna serious  warning to  tdp leaders
Highlights

తీరు మార్చుకోకపోతే తాట తీస్తానన్న బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  చిలమత్తూరు మండలంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక నుంచి నాయకులందరూ ఒకే మాటపై ఉండాలన్నారు. తీరు మార్చుకోని నాయకుల తాట తీస్తానని హెచ్చరిచారు.

గురువారం బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. నేతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. కొందరు తమకు గుర్తింపు రావడం లేదని బాలకృష్ణ తో మెరపెట్టుకున్నారు. అభివృద్ధి పనులు కూడా వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నారని, పనులను సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పంచుకుంటున్నారే తప్ప కార్యకర్తల బాగోగులు చూడడంలేదని పలు పంచాయతీల కార్యకర్తలు బాలయ్య ముందు గోడు వెళ్లబోసుకున్నారు. 

దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ఇకపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలపై దృష్టి సారిస్తానని, అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఓటర్లలో సంతృప్తి ఉన్నా నాయకుల్లోనే కొంత అసంతృప్తి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటివరకు జరిగింది మరచిపోయి నాయకులు, కార్యకర్తలు ఓ కుటుంబంలా పనిచేయాలని, లేదంటే తన అవతారం చూస్తారన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నవారున్నారన్నారు. నాన్న స్థాపించిన పార్టీకి చెడ్డపేరు తీసుకురాకుండా పనిచేయాలన్నారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

loader