Asianet News TeluguAsianet News Telugu

తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ లైంగిక వేధింపులు...

మహిళలకు ఇళ్లు,రోడ్డు,గుడి, బడి ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. వారిపై రోజు రోజుకు లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా భారత దేశంలోనే అత్యంత గొప్ప దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ లైంగిక వేధింపుల సంస్కృతి పాకింది. ఈ ధార్మిక సంస్థ కు చెందిన ఏఈవో స్థాయి ఉన్నతోద్యోగి తన కిందిస్థాయి మహిళా ఉద్యోగి కూతురిని లైంగికంగా వేధిస్తున్న విషయం బైటపడింది. గత కొన్ని రోజులుగా ఏఈవో తన కూతురిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా ఉద్యోగి ఆరోపణలతో టిటిడిలో కలకలం రేగింది.

TTD staffer alleges harassment
Author
Tirupati, First Published Aug 23, 2018, 11:06 AM IST

మహిళలకు ఇళ్లు,రోడ్డు,గుడి, బడి ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. వారిపై రోజు రోజుకు లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా భారత దేశంలోనే అత్యంత గొప్ప దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ లైంగిక వేధింపుల సంస్కృతి పాకింది. ఈ ధార్మిక సంస్థ కు చెందిన ఏఈవో స్థాయి ఉన్నతోద్యోగి తన కిందిస్థాయి మహిళా ఉద్యోగి కూతురిని లైంగికంగా వేధిస్తున్న విషయం బైటపడింది. గత కొన్ని రోజులుగా ఏఈవో తన కూతురిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా ఉద్యోగి ఆరోపణలతో టిటిడిలో కలకలం రేగింది.

వివరాల్లోకి వెళితే...టిటిడి ఆద్వర్యంలో నడిచే శ్రీనివాస మంగాపురం ఆలయానికి శ్రీనివాసులు ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే అక్కడే పనిచేసే ఓ మహిళా ఉద్యోగి అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అతడి నుండి తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని వేడుకుంది. చంద్రగిరి పోలీసులతో పాటు టిటిడి జేఈవో కూడా ఆమె ఫిర్యాదు చేసింది.

గత కొన్ని రోజులుగా అతడు తన కూతురిని వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగి తెలిపింది. అయితే ఉన్నత స్థాయి ఉద్యోగి కావడంతో భయపడి ఇప్పటివరకు బైటపెట్టలేదని కానీ ఈ మధ్య అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో పోలీసులకు ఆశ్రయించినట్లు సదరు మహిళ తెలిపింది. వెంటనే టిటిడి ఉన్నతిధికారులు, పోలీసులు ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలనికి కోరుకుంటున్నట్లు తెలిపింది.

ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios