గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ బాలిక దారుణ హత్యకు గురయ్యింది. నరసరావుపేటకు చెందిన అనూష(16) అనే బాలికను నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడు. కాగా... అనూష రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ హత్య జరిగింది.

Also Read ఏలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని సహజీవనం, చివరకు...

అనుష సోదరుడి సమాచారం మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. అయితే.. రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి అనుషను అతి దారుణంగా హత్య చేశారని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నాడు.

అయితే... ఇంట్లో ఉన్న మనుషులు కాకుండా బయట నుంచి కొత్తగా ఎవరూ రాలేదని క్లూస్ టీం అధికారులు చెబుతున్నారు. దీంతో... అందరి అనుమానం అనుష సోదరుడి మీద కలుగుతోంది. చెల్లిని చంపేసి.. ఏమీ తెలియనట్లు నాటకం ఆడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.