ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. దీంతో తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో  పలువురు మంత్రులు, అధికారులు జగన్‌కు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Also read:రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత

కేక్‌ తినిపించారు. శుక్రవారం సాయంత్రం కూడ ఏపీ సీఎం జగన్‌కు ఓ కార్యక్రమంలో మంత్రులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు  పలువురు అధికారులు  జగన్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు