రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత
జీఎన్ రావు కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
అమరావతి:జీఎన్ రావు కమిటీని నిరసిస్తూ అమరావతి పరిసర గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు చేస్తున్నారు. మందడం వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు దగ్దం చేసి తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీలను దగ్థం చేశారు
Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు
మూడు రోజులుగా అమరావతి సమీపంలో మందడం, వెలగపూడి తో పాటు పలు గ్రామాల ప్రజలు నిరసనలు చేస్తున్నారు. మందడం వద్ద సీడీ యాక్సెస్ రోడ్డు నుండి సచివాలయం రోడ్డును రైతులు బ్లాక్ చేశారు. రోడ్డుపై అడ్డంగా సిమెంట్ బెంచీలు వేశారు. రోడ్డుపై వాహనాలను అడ్డంగా నిలిపారు.
Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు
రోడ్లపైనే టైర్లను దగ్ధం చేశారు. జీఎన్ రావు కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా గ్రామాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికనపు పరిగణనలోకి తీసుకోవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ 29 గ్రామాల ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు..
Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు
వివిధ రూపాల్లో స్థానికులు, రైతులు ఆందోళనలకు దిగారు. వెలగపూడిలో రైతులు మూడో రోజు దీక్షలు చేస్తున్నారు. వెలగపూడి గ్రామపంచాయితీ కార్యాలయానికి వైసీపీ రంగులను రైతులు తుడిచివేసే ప్రయత్నం చేశారు.గ్రామ పంచాయితీ కార్యాలయానికి రంగు వేస్తున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు రైతులు గ్రామపంచాయితీ కార్యాలయానికి నల్లరంగు పూయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో వెలగపూడి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు దున్నపోతుతో రైతులు, స్థానికులు మందడంలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని స్థానికులు విమర్శలు గుప్పించారు.