అమరావతి: లోకేష్ ప్రోత్సహంతోనే తనతో పాటు కొందరు మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడికి యత్నించారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. శాసనమండలిలో జరిగిన ఘటనలను ఫోన్లో లోకేష్ దృశ్యాలు రికార్డు చేయడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. 

గురువారం నాడు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.ద్రవ్య వినిమయ బిల్లును సెషన్ చివర్లో సభలో పెట్టడం సంప్రదాయమన్నారు. సంప్రదాయాలను మార్చడంలో తప్పేమీటని చైర్మెన్ స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మెన్ మాట్లాడడంలో అర్ధం లేదన్నారు.

also read:మంత్రులు తొడగొట్టారు, పోడియం చుట్టుముట్టారు: మండలి పరిణామాలపై యనమల

మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు పట్ల తనకు బాధ కల్గిస్తోందన్నారు. మండలిలో లోకేష్ ఫోన్‌లో దృశ్యాలను రికార్డు చేసి బయటకు పంపారన్నారు. లోకేష్ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యారని ఆయన విమర్శించారు.

సంఖ్య బలం ఉందని మాత్రమే టీడీపీ మండలిలో బిల్లులను అడ్డుకొందన్నారు. ప్రజల కోసం తమపై చేసిన దాడులను కూడ తట్టుకొంటున్నామన్నారు. 
బిల్లులను ఎన్నిసార్లు టీడీపీ అడ్డుకొంటుందని ఆయన ప్రశ్నించారు. 

లోకేష్ ప్రోత్సహంతోనే  బీద రవిచంద్ర యాదవ్, దీపక్ రెడ్డి లాంటి వాళ్లు రెచ్చిపోయారన్నారు. తమపై దాడులు చేశారన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మండలి ఛైర్మెన్, డిప్యూటీ ఛైర్మెన్లు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించారన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆయన శాసనమండలి ఛైర్మెన్ ను కోరారు.