తెలుగుదేశంపార్టీ నేతల స్వరం మెల్లిగా మారుతోంది. జనసేనను, పవన్ కల్యాణ్ న్ను తీసిపారేస్తున్నారు. పవన్ గురించి ఆలోచించే సమయమే తమకు లేదన్నారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదని ఎద్దేవా చేసారు.

తెలుగుదేశంపార్టీ నేతల స్వరం మెల్లిగా మారుతోంది. జనసేనను, పవన్ కల్యాణ్ న్ను తీసిపారేస్తున్నారు. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగా పోటీ చేస్తుందని ప్రకటించారో అప్పటి నుండో టిడిపి గొంతు సవరించుకుంటోంది. మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటనే అందుకు నిదర్శనం.

పవన్ గురించి ఆలోచించే సమయమే తమకు లేదన్నారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదని ఎద్దేవా చేసారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల గురించి నిర్మాణ బద్ధంగా పవన్ ఆలోచించడం లేదని మండిపడ్డారు. పవన్‌ గురించి ఆలోచించే సమయం తమకు లేదని కూడా చెప్పారు. తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీనే కానీ జనసేన ఎంత మాత్రం కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, మెల్లి మెల్లిగా టిడిపిలోని ఇతర నేతలు కూడా బహుశా పితానిని అనుసరించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.