అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి.. మూడు శాఖల్లో పోస్టుల భర్తీ: పేర్ని నాని
అమ్మఒడి పథకానికి (amma vodi scheme) 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (perni nani) . సీఎం జగన్ (Ys jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్ (ap cabinet) సమావేశం ముగిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు.
అమ్మఒడి పథకానికి (amma vodi scheme) 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (perni nani) . సీఎం జగన్ (Ys jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్ (ap cabinet) సమావేశం ముగిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు. అర్హత వున్న వారందరికీ జూన్, డిసెంబర్‌లో అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. అర్హత వున్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ALso Read:త్వరలో బీసీ జనగణన, సినిమా టికెట్ల విక్రయానికి గ్రీన్ సిగ్నల్: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ అంగీకారం తెలిపినట్లు పేర్ని నాని వెల్లడించారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదని మంత్రి గుర్తుచేశారు. బీసీ జనగణనకు సంబంధించిన అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు పేర్ని నాని తెలిపారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
560 అర్బన్ హెల్త్ క్లినిక్స్‌లో ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి ఆమోదం
వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
వైద్యారోగ్య శాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పేర్నినాని చెప్పారు.
అనంతపురం జిల్లాలో వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం
జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకకు ఆమోదం
పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
ప్రకాశం జిల్లాలో జేఎన్టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం
అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు.
కొత్తగా జైన్, సిక్కు కార్పోరేషన్ల ఏర్పాటుకు ఆమోదం.
విశాఖ మధురవాడలో అదాని ఎంటర్‌ప్రైజెస్‌కు 130 ఎకరాలను కేటాయింపునకు కేబినెట్ ఆమోదించింది.
200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్క్ కోసమే 130 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపింది.
ప్రకాశం జిల్లాలో 5 ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్ ఆమోదం.
7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్వైపాక్షిక ఒప్పందానికి ఆమోదం.
అమ్మఒడి పథానికి 75 శాతం హాజరు వుండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశానికి గ్రీన్ సిగ్నల్
ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేకశాఖ ఏర్పాటుకే కేబినెట్ ఆమోదం.
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49కే ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.