త్వరలో బీసీ జనగణన, సినిమా టికెట్ల విక్రయానికి గ్రీన్ సిగ్నల్: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ (ap cabinet) సమావేశం ముగిసింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. బీసీ జనగణన, ఆన్‌లైన్ మూవీ టికెట్ల విక్రయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వేసింది.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ (ap cabinet) సమావేశం ముగిసింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. బీసీ జనగణన చేయాలనే తీర్మానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వేసింది. అలాగే మధురవాడలో శారదాపీఠానికి (sharada peetham) 15 ఎకరాలు కేటాయించింది. రాష్ట్రంలో గుట్కా నిషేధానికి చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టాలీవుడ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల (movie tickets) విక్రయ నిర్ణయానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో పాటు యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఓకే చెప్పింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
- అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు.
- కొత్తగా జైన్, సిక్కు కార్పోరేషన్ల ఏర్పాటుకు ఆమోదం.
- విశాఖ మధురవాడలో అదాని ఎంటర్‌ప్రైజెస్‌కు 130 ఎకరాలను కేటాయింపునకు కేబినెట్ ఆమోదించింది.
- 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్క్ కోసమే 130 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపింది.
- ప్రకాశం జిల్లాలో 5 ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్ ఆమోదం.
- 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్వైపాక్షిక ఒప్పందానికి ఆమోదం.
- అమ్మఒడి పథానికి 75 శాతం హాజరు వుండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశానికి గ్రీన్ సిగ్నల్
- ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేకశాఖ ఏర్పాటుకే కేబినెట్ ఆమోదం.
- సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49కే ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.