జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పరిటాల సునీత

minister paritala sunitha fire on jagan
Highlights

జగన్ ది దొంగల పార్టీ అన్న సునీత

వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పరిటాల సునీత విరుచుకుపడ్డారు. జగన్ ది దొంగల పార్టీతో పోల్చారు. ఇలాంటి దొంగల పార్టీకి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని దోచేస్తారని ఆమె పేర్కొన్నారు.  ఆదివారం అనంతపురం జిల్లా గార్లెదిన్నెలో మిని మహానాడు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీత.. జగన్ పై మండిపడ్డారు.

అధికార దాహంతో జగన్‌ లేనిపోని హామీలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ యన మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే పూర్తిగా దోచేస్తారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న ఎందరో మహానుభావులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ బాధలు కాంగ్రెస్‌ హయాంలో అనుభవించామని గుర్తుచేశారు.
 
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరించకపోగా అన్ని రకాలుగా అడ్డుపడుతున్నా ఏపీని అభివృద్ధి పథంలో సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారన్నారు. కుల, మత రా జకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులకు న్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై సీఎం చంద్రబాబు సుభిక్షపాలనను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. బీజేపీకి కర్ణాటక ఎన్నికలే గుణపాఠమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

loader