నిరుద్యోగులపై లోకేష్ కామెంట్.... తిరిగి సెటైర్ వేసిన యువత

First Published 9, Aug 2018, 10:12 AM IST
minister lokes comment on unemployee.. youth re counter on lokesh
Highlights

నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్ కి.. కొందరు యువకులు తిరిగి సెటైర్ వేశారు. 

ఏపీ మంత్రి లోకేష్ కి చేదు అనుభవం ఎదురైంది. నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్ కి.. కొందరు యువకులు తిరిగి సెటైర్ వేశారు.  ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.వెయ్యి చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అలా మాట్లాడుతూ.. యువకులు రూ.1000 భృతితో సెల్‌ఫోన్‌ కొనుక్కొని ఇంట్లో పడుకొని జల్సా చేయవద్దని మంత్రి లోకేష్ కామెంట్ చేశారు.

అయితే.. ఆ కామెంట్ ని సీరియస్ గా తీసుకున్న కొందరు యువకులు వెంటనే లోకేష్ కి సెటైర్ వేశారు. రూ.1000 భృతితో సెల్ ఫోన్ కొనుక్కోవడం కాదు.. సింగపూర్ వెళ్లి జల్సా చేసి వస్తామని సెటైర్ చేశారు. దీంతో ఖంగుతిన్న మంత్రి.. వెంటనే ఆ టాపిక్ మార్చేసి వేరే విషయం గురించి చర్చించడం గమనార్హం. 

loader