ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటిక‌ల్ హీట్ ను క్రియేట్ చేశాయి.  ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు ఫైర్ అయ్యారు. తాజాగా మంత్రి కన్నబాబు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరో నాని మాటలకు నాకేం అర్ధం కాలేదని ఏద్దేవా చేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, చంద్ర‌బాబుల పైనా మంత్రి కన్నబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని (hero nani) చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా చ‌ర్చనీయంగా మారాయి. పొలిటిక‌ల్ హీట్ ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు ఫైర్ అయ్యారు. తాజాగా మంత్రి కన్నబాబు (minister kanna babu) కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని విమ‌ర్శించారు.

సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులని అవమానించిన‌ట్లా..? టికెట్ రేట్లు పెంచితే ప్రేక్షకుల గౌరవం పెంచినట్లా? థియేటర్ల లో ప్రభుత్వం తనిఖీలు చేయొద్దా? హీరో నానిని మంత్రి సూటిగా ప్రశ్నించారు. వాళ్లే మాట్లాడుకుని.... వాళ్లే వివాదాలు సృష్టించుకుంటున్నారని మంత్రి క‌న్న‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. 

Read Also:కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు

థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని అన్నారు. సినిమా హాల్లో పాప్ కార్న్ 300, డ్రింక్ 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. రైతులు మొక్కజొన్న క్వింటాలు రూ. 1500 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ, సినిమా ధియేటర్ లో రూ.100, గ్రాముల పాప్ కార్న్ రూ.300 రూపాయలకి అమ్ముతున్నారని, కిరాణా షాపుల అంటే నానికి చులకనా.. ధియేటర్ లు తనిఖీలు చేస్తే తప్పేంటి ..? అని ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై హీరో నాని మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరల విషయంలో అసంతృప్తి చెందిన నాని.. ఇలా రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమేనని ఆయన అన్నారు. 

Read Also: darbhanga blast case: ఎన్ఐఏ ఛార్జిషీట్.. కుట్ర ఇలా, నిందితులు వీరే

మరోవైపు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపైనా మంత్రి కన్నబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అశోక్ గజపతి రాజు ఏమైనా దైవంశ సంభూతుడా..? పీఠాధిపతా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకం లాగేయడం అశోకగజపతి రాజు లాంటి వారికి తగునా ప్ర‌శ్నించారు. గర్భగుడిలోనే దేవాదాయశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా అశోక్ గజపతి రాజు మాట్లాడారని, రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం.. తిరిగి తమపై ఆరోపణలు చేయడం తప్పు అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు కోసం అధికారులు ప్రొటోకాల్ పాటించారని, 40 ఏళ్లుగా రామతీర్థం ఆలయాన్ని అశోక్ గజపతి రాజు ఎందుకు అభివృద్ది చేయలేదని నిలదీశారు. రామతీర్థం ఆలయాన్ని భద్రాచలం లాగా ఎందుకు అభివృద్ధి చేయలేదని నిల‌దీశారు.

Read Also: ధాన్యంపై తేల్చరు, ప్రేమలేఖలు రాసేందుకు ఢిల్లీ వచ్చినట్లు ఫీలవుతున్నారు: కేంద్ర మంత్రులపై నిరంజన్‌రెడ్డి ఆగ్రహం

లోకేష్ ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలుకుతున్నారనీ, ఆయన అందరి సంగతి చూస్తా అంటున్నారు అక్కడి దాకా ఆయన వస్తాడా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు పరిపాలన కంటే వందరెట్లు ఎక్కువగా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. దేశంలో సిగ్గు లేని నాయకుడు ఎవరని ఓటింగ్ పెడితే ఒకటి నుంచి 10 స్థానాలు చంద్రబాబుకే వస్తాయని.. మంత్రి విమర్శించారు. రైతులను మోసం చేయబట్టే చంద్రబాబును ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినట్లు 23 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.

Read Also: బ్యాంకులకు ఎగనామం.. పారిశ్రామికవేత్త రెబ్బా సత్యనారాయణ ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ

14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. రైతుల కోసం ఏం చేశాడ‌ని ప్ర‌శ్నించారు. బోర్ల క్రింద వరి తగ్గించాలని కోరాం గాని వరి వేయవద్దని మేం చెప్పలేదని అన్నారు. సీఎం జ‌గ‌న్ ఈ రెండున్నరేళ్ల కాలంలో 90 వేల కోట్లు రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేశార‌ని అన్నారు. టీడీపీ హయాంలో 43 వేల కోట్ల తో ధాన్యం కొనుగోళ్లు చేస్తే.. జ‌గ‌న్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 32 వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేసింద‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 10878 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఒక్క రోజు కూడా రాష్ట్రంలో ఎరువులు కొరత ఏర్పడలేద‌ని అన్నారు.

అలాగే రైతులకు పంట రుణాలు లక్ష్యానికి మించి ఇస్తున్నామ‌నీ, రైతులను తప్పుదోవపట్టించరాదని చంద్రబాబుని కోరుతున్నామ‌ని అన్నారు. దేశంలో ఏపీ వ్యవసాయ అభివృద్ధి లో మొదటి స్థానంలో ఉందని, వ్యవసాయ వృద్ధిరేటు జాతీయ సగటు 4.81 శాతం వుంటే ఏపీ 9.31 శాతం తో ముందంజలో ఉందని వివ‌రించారు. జ‌గ‌న్ స‌ర్కార్ విత్తనం నుండి విక్రయం వరకు రైతులకు అండగా ఉందని అన్నారు.