దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుళ్ల కేసులో (darbhanga blast case) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (nia) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగానే దర్బంగా పేలుళ్లు జరిగినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ మేరకు ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుళ్ల కేసులో (darbhanga blast case) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (nia) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగానే దర్బంగా పేలుళ్లు జరిగినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ మేరకు ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసింది. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కపిల్ అహ్మద్, ఇక్బాల్‌పై అభియోగాలు నమోదు చేసింది ఎన్ఐఏ. సికింద్రాబాద్ నుంచి దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో (darbhanga express) బాంబులు పార్శిల్ చేశారు. అనంతరం దర్భంగా రైల్వేస్టేషన్‌లో ఈ బాంబులు పేలాయి. పేలుడుకు ముందు పాకిస్తాన్‌లో మాలిక్ సోదరులకు శిక్షణ ఇచ్చినట్లుగా ఎన్ఐఏ వెల్లడించింది. పేలుడు తర్వాత ఉగ్రవాదులంతా నేపాల్ ద్వారా పాక్ వెళ్లేందుకు కుట్ర పన్నినట్లు పేర్కొంది. 

ఇక దర్భాంగా బ్లాస్ట్ కేసులో నిందితుల నుండి ఎన్ఐఏ కీలక విషయాలను సేకరించారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్న నిందితులు విచారణ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయం ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.లష్కరే తోయిబా (lashkar e taiba) నేత ఇక్బాల్ ఆదేశం మేరకు భారత్ లో పేలుళ్లకు మాలిక్ సోదరులు కుట్ర పన్నారని ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా నేత ఇక్బాల్ తో ఖలీం అనే వ్యక్తి తరచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ALso Read:దర్బంగా పేలుడు కేసు: సూత్రధారి సలీమ్.. ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌కు, పాక్ నుంచి నిధులు

హజీ సలీమ్ అనే వ్యక్తికి ఇంటర్నెట్ పై అవగాహన లేదు. దీంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకొన్నాడని దర్యాప్తు అధికారులు తేల్చారు. పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖన్నా సోషల్ మీడియా ద్వారా వీరితో మాట్లాడినట్టుగా గుర్తించారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ మోమిన్ కూడ భారత్ లో పేలుళ్లకు కుట్రలో పాలుపంచుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఇండియాలో ఒక్కో బ్లాస్ట్‌కు మాలిక్ సోదరులకు కోటి రూపాయాలను నజరానాగా ఇస్తామని ఆశ చూపారని దర్యాప్తులో వెల్లడించినట్టుగా సమాచారం. 2013లో నిందితులు పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా కీలక నేతలను కలుసుకొన్నారు.