Asianet News TeluguAsianet News Telugu

పిల్ల సైకోలతో మీటింగ్‌లు.. ఏపీలో రెచ్చగొట్టి హైదరాబాద్‌ పోతాడు : పవన్‌పై జోగి రమేశ్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి జోగి రమేశ్. పిల్ల సైకోలను పోగేసుకొని వచ్చి మీటింగ్ పెడతారా అంటూ మండిపడ్డారు. 2014లో ఒక్కరికి కూడా స్థలం ఇవ్వని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి నిలదీశారు. 

minister jogi ramesh slams janasena chief pawan kalyan over housing
Author
First Published Nov 13, 2022, 5:53 PM IST

ఏ రాష్ట్రంలో జరగని ఇళ్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందన్నారు మంత్రి జోగి రమేశ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని జోగి రమేశ్ ప్రశంసించారు. పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదని.. చంద్రబాబునని ఆయన చురకలంటించారు. పిల్ల సైకోలను పోగేసుకొని వచ్చి మీటింగ్ పెడతారా అని జోగి రమేశ్ మండిపడ్డారు. పిల్ల సైకోలను టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు తరిమికొట్టారని ఆయన పేర్కొన్నారు. 

జరుగుతున్న నిర్మాణ పనులు పవన్‌కు ఎందుకు కనబడటం లేదని జోగి రమేశ్ ప్రశ్నించారు. దుర్మార్గంగా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని.. 2014లో ఒక్కరికి కూడా స్థలం ఇవ్వని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి నిలదీశారు. ఆ రోజు ప్రశ్నిస్తానన్న పవన్ ఏం చేశారని జోగి రమేశ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు పేదలకు మంచి చేస్తున్న మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. పాదయాత్రలో పేదల కష్టాలు చూసి జగన్ ఇళ్లు ఇస్తున్నారని మంత్రి ప్రశంసించారు. 

ALso REad:వైసీపీ సర్కార్ ను కిందకు ఈడ్చుతాం:విజయనగరంలో పవన్ కళ్యాణ్

ఏపీలో ఇళ్ల నిర్మాణాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుందని జోగి రమేశ్ గుర్తుచేశారు. పవన్ ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టి హైదరాబాద్ వెళ్లిపోతున్నారని.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని మంత్రి దుయ్యబట్టారు. పవన్, చంద్రబాబు కలిసొచ్చినా జగన్ ప్రభుత్వాన్ని కదిలించలేరని.. దేశంలో ఎక్కడా ఇవ్వని సంక్షేమ పథకాలు జగన్ అందిస్తున్నారని జోగి రమేశ్ కొనియాడారు. దేశంలో ఎక్కడా ఇవ్వని సంక్షేమ పథకాలు జగన్ అందిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios