వైసీపీ సర్కార్ ను కిందకు ఈడ్చుతాం:విజయనగరంలో పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు ఈడ్చుతామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న ఇళ్లను పరిశీలించిన తర్వాత ఆయన ప్రసంగించారు. ఏపీలో జనసేన సర్కార్ ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
విజయనగరం:వైసీపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.అంతేకాదు వైసీపీ సర్కార్ ను కిందకు ఈడుస్తామని ఆయన హెచ్చరించారు.ఏపీలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లాలోని గుంకలాం గ్రామంలో జగనన్న కాలనీని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారంనాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. వైసీపీ అవినీతి కోటలను బద్దలు కొడుతామన్నారు.తన పై ఢిల్లీకి వెళ్లి వైసీపీ నేతలు పిర్యాదులు చేస్తారని చెబుతున్నారన్నారు. ఏపీకి ఏం చేశారో చెప్పాలని వైసీపీని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం ఏం చేయాలో వైసీపీ ఏనాడైనా పట్టించుకొందా అని ఆయన ప్రశ్నించారు.ఉత్తరాంధ్ర అభివృద్దిని వైసీపీ పట్టించుకొందా అని ప్రశ్నించారు. గడప గడపకు వైసీపీ నేతలు వస్తే సమస్యలపై నిలదీయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రజల సమస్యలను పని చేయని వైసీపీ నేతలను నిలదీయాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.జగనన్న కాలనీలు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని వైసీపీ నేతలను నిలదీయాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.
వైసీపీ నేతలు మర్యాదగా మాట్లాడితే మీరు మర్యాదగా మాట్లాడాలని జనసేన నేతలను కోరారు. అమర్యాదగా మాట్లాడితే అదే స్థాయిలో మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తాను చూపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎలాంటి పదవులు లేని గాంధీ,సుభాష్ చంద్రబోస్ లు ఎలా పనిచేశారో తమ పార్టీ కూడాఏపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
also read:ఆయనది రాద్థాంతమే... గోరంత ఉపయోగం లేదు : పవన్ రుషికొండ పరిశీలనపై బొత్స వ్యాఖ్యలు
మీ భవిష్యత్తు కోసం తనను నమ్మాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జెట్టీ నిర్మించి మత్స్యకారుల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు.ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు. మీపై కేసులు పెడితే తాను అండగా ఉంటానన్నారు. స్వచ్ఛంధంగా జైళ్లకు వెళ్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతమందిని జైళ్లలో పెడతారని ఆయన ప్రశ్నించారు.తనకు చదువుతో పాటు నటనను నేర్పింది ఉత్తరాంధ్రేనని పవన్ కళ్యాణ్ చెప్పారు.అందుకే తనకు ఈ ప్రాంతమంటే చాలా అభిమానమన్నారు.ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.మీ భవిష్యత్తు కోసమే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.