ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రెమ్యూనరేషన్‌ను బట్టి పవన్ కల్యాణ్ డైలాగులు, కాల్షీట్లు వుంటాయన్నారు. డబ్బులు సంపాదించేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెమ్యూనరేషన్‌ను బట్టి పవన్ కల్యాణ్ డైలాగులు, కాల్షీట్లు వుంటాయన్నారు. డబ్బులు సంపాదించేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పుడు హాలీడే టూర్ చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్ర అంశాలపై ఎలాంటి అవగాహన లేకుండానే పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.

చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే ప్రజల్లోకి వచ్చి స్క్రిప్ట్ చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ తన ఫామ్‌హౌస్‌లో వుంటే సచివాలయ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని చెల్లుబోయిన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు నిలకడ, ఓపిక లేవని.. పిచ్చి మాటలతో ప్రజల నమ్మకం పోయేలా నడుచుకోవద్దన్నారు. అబద్ధానికి ఆసరాగా నిలిచారంటూ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. 

అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ కు సంస్కారం గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. పీఆర్‌పీలో ఉన్న సమయంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడారన్నారు. పంచెలూడదీసి కొడతానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంబటి గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని... అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ప్రజలు అనుకున్నారని దుయ్యబట్టారు. 

ALso Read: మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్

పవన్ కల్యాణ్ చిత్ర విచిత్ర స్వభావం కలిగిన వ్యక్తి అని అంబటి రాంబాబు చెప్పారు. వారాహి యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై ఆయన మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తామని మాట తప్పిన టీడీపీపై కాపులు కోపంగా ఉన్నారన్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారన్నారు. చెప్పులు పట్టుకుని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. 

పవన్ కళ్యాణ్‌ను గాలి కళ్యాణ్‌గా అంబటి రాంబాబు అభివర్ణించారు. పవన్ కళ్యాణ్‌ను సార్థకనామధేయుడు అంటూ సెటైర్లు వేశారు. వాలంటీర్లపై మీ అభ్యంతరం ఏమిటీ గాలి కళ్యాణ్ అంటూ ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల సేవలను చూసి పవన్ కళ్యాణ్ భయపడిపోతున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.