మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు.
తాడేపల్లి: బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ కు సంస్కారం గురించి మాట్లాడే నైతికత లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. శుక్రవారంనాడు తాడేపల్లిలో మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
పీఆర్‌పీలో ఉన్న సమయంలో కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడారన్నారు. పంచెలూడదీసి కొడతానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ప్రజలు అనుకున్నారన్నారు.
also readరౌడీ పిల్లాడు, జగ్గు భాయ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు: జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
పవన్ కల్యాణ్ చిత్ర విచిత్ర స్వభావం కలిగిన వ్యక్తి అని అంబటి రాంబాబు చెప్పారు. వారాహి యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై ఆయన మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తామని మాట తప్పిన టీడీపీపై కాపులు కోపంగా ఉన్నారన్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారన్నారు.
బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. సంస్కారం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.చెప్పులు పట్టుకుని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైందని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ను గాలి కళ్యాణ్ గా అంబటి రాంబాబు అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ ను సార్థకనామధేయుడు అంటూ సెటైర్లు వేశారు. వాలంటీర్లపై మీ అభ్యంతరం ఏమిటీ గాలి కళ్యాణ్ అంటూ ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల సేవలను చూసి పవన్ కళ్యాణ్ భయపడిపోతున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చిందని ఆయన ఆరోపించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తమిళనాడు మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు , తోట చంద్రశేఖర్ , రాజు రవితేజ తదితరులు పవన్ కళ్యాణ్ ను వీడి వెళ్లారని ఆయన గుర్తు చేశారు.
ఒక్క మాట మీద కూడ నిలబడని వ్యక్తితత్వం పవన్ కళ్యాణ్ ది అని అంబటి రాంబాబు గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ అప్పుడే ఊగిపోతాడు, అప్పుడే సాగిపోతాడన్నారు. ఎప్పుడూ ఏం మాట్లాడుతారో అర్థం కాదన్నారు. పవన్ కళ్యాణ్ హద్దులు మీరి మాట్లాడుతున్నారన్నారు. వారాహి ఎక్కి పవన్ కళ్యాణ్ అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారన్నారు. కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థానంలో ప్రస్తుతం దుష్టచతుష్టయం ఫోర్స్ జనసేన రూపంలో వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.