ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు అంటున్నారని.. అమ్మఒడి ఎవరు పెట్టారు..? వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారని ఆయన ప్రశ్నించారు.

విద్య వైద్యానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. ఆరోగ్యం బాగా లేకపోతే కష్టాలు ఉంటే ప్రభుత్వం ఆసరాగా..భరోసా గా పథకాలు ప్రవేశపెట్టిందని బొత్స గుర్తుచేశారు. ఒక ప్రజాప్రతినిధి తన అభిప్రాయం చెబితే అసమ్మతి సెగలు అని రాస్తారా ? అని మంత్రి నిలదీశారు.

Also Read:పాత రుచి, కొత్త రంగు.. వైసీపీ మాయాజాలానికి ఇవే నిదర్శనాలు : చంద్రబాబు

చంద్రబాబు నాయుడు పడిపోయిన వ్యక్తిని ఎన్ని రాతలు రాసినా లేపలేరని, గత ఏడాది కాలంలో మధ్యాహ్నం భోజనంలో ఎంతో మార్పు వచ్చిందని సత్యనారాయణ అన్నారు. వడ్డీ లేని రుణం అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చారా ? అని నిలదీశారు.

జగన్ మోహన్ రెడ్డి  పైసా తో సహా అక్క చెల్లెళ్ళ వడ్డీ చెల్లించారని.. వాహన మిత్ర పేరిట ఆటో డ్రైవర్ కి రెండు సంవత్సరాలలో 10 వేలు చొప్పున వైయస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది..అబద్దమా ? అని ఆయన అన్నారు.

Also Read:చంద్రబాబు, లోకేశ్ కాదు..టీడీపీ ఆఫీస్ బాయ్ చాలు : శ్రీకాంత్ రెడ్డి సవాల్ పై బోండా కౌంటర్

భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో అంశాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని.. ఇంకా అమలు చేయలేని అంశాలు త్వరలో అమలు చేస్తానని ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి చెబుతున్నామని సత్యనారాయణ అన్నారు.

తమది లేనిది వుందని చెప్పే ప్రభుత్వం కాదని బొత్స వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయాలు పెడతానని సీఎం తొలిరోజు చెప్తే అమలవుతుందా అని అనుకున్నా.. కానీ అమలు చేస్తానని సీఎం చెప్పి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు.