Asianet News TeluguAsianet News Telugu

రోజా వెక్కి వెక్కి ఏడ్చారు.. ఈ విషయం గుర్తు రాలేదా, చంద్రబాబుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana). మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది టీడీపీ (tdp) నేతలేనంటూ దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులు భరించలేక తమ పార్టీ ఎమ్మెల్యే రోజా (rk roja) కంటతడి పెట్టుకున్నప్పుడు ఆయనకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. 

minister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over ap assembly incident
Author
Anantapur, First Published Nov 27, 2021, 10:01 PM IST

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) . ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది టీడీపీ (tdp) నేతలేనంటూ దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులు భరించలేక తమ పార్టీ ఎమ్మెల్యే రోజా (rk roja) కంటతడి పెట్టుకున్నప్పుడు ఆయనకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదని.. అయితే, అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై (nara bhuvaneshwari) ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. 

టీడీపీ నిర్వహించే ఆడపడుచుల ఆత్మగౌరవ సభలపై ఆయన విమర్శలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు ఎప్పుడూ చూడలేదంలూ బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడే లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేశారని మంత్రి ఆరోపించారు. తన భార్యను అసభ్య పదజాలంతో దూషించారని చంద్రబాబు ఏడ్చిన ఉదంతంపై స్పందించాల్సిన అవసరం లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.

Also Read:చంద్రబాబు కంటతడి.. కానిస్టేబుల్ మనస్తాపం: వాళ్ల దగ్గర పనిచేయలేనంటూ ఉద్యోగానికి రాజీనామా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) మహిళలకు పెద్దపీట వేస్తున్న విషయం అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని బొత్స ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మకుండా.. జగనన్న సంపూర్ణ హక్కు పథకాన్ని (jagananna sampoorna gruha hakku) సద్వినియోగం చేసుకోవాలని మంత్రి బొత్స సూచించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. 

కాగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో ఎమ్మెల్యే రోజా పలుమార్లు మీడియా ముందు విలపించారు. 2017లో అమరావతిలో జరిగే మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన రోజాను పోలీసులు మార్గమధ్యంలోనే అరెస్ట్ చేశారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాణి ఉందని, తమ ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios