Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కంటతడి.. కానిస్టేబుల్ మనస్తాపం: వాళ్ల దగ్గర పనిచేయలేనంటూ ఉద్యోగానికి రాజీనామా

ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుపై వైసీపీ (ysrcp) నేతల వ్యాఖ్యలకు నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

head constable resigns to his job in protest of ysrcp misbehavior with chandrababu
Author
Amaravati, First Published Nov 20, 2021, 2:27 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (ap assembly sessions) వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ  సభ్యులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు బోరున విలపించారు. ఈ కంటతడి పెట్టడంపై టీడీపీ శ్రేణులతో పాటు రాజకీయ పక్షాలు సైతం ఖండించాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుపై వైసీపీ (ysrcp) నేతల వ్యాఖ్యలకు నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాను ఎంతో అభిమానించే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్ గా నిలిచానని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎంతో నిజాయతీతో పని చేశానని ఆయన చెప్పారు. ఎప్పుడూ ఎవరి వద్దా చేయి చాచకుండా విధులను నిర్వర్తించానని తెలిపారు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక వ్యక్తిని అసెంబ్లీలో దూషించడం సరికాదని... విలువలు లేని వారి వద్ద పని చేయడం ఇష్టం లేక తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని హెడ్ కానిస్టేబుల్ వెల్లడించారు. 

ALso Read:Nandamuri Balakrishna: చేతులు ముడుచుకుని కూర్చోం.. బద్దలు కొట్టుకుని వస్తాం.. బాలకృష్ణ వార్నింగ్

కాగా.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu)  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios