అమరావతి: పంచాయతీ ఎన్నికల రెండో దశలోనూ వైయస్సార్‌సీపీ మద్దతుదార్ల జయభేరి మోగించారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రెండో విడతలో భాగంగా 3328 పంచాయతీలకు నిన్న(శనివారం) ఎన్నికలు జరగడంతో పాటు ఫలితాలు కూడా ప్రకటించారని... వీటిల్లో అత్యధిక పంచాయితీలను వైసిపి కైవసం చేసుకుందని మంత్రి ప్రకటించారు. ఇలా రెండు విడతల్లో వైయస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారని మంత్రి పేర్కొన్నారు. 

''సీఎం జగన్ సంక్షేయ పాలనకు ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఈ పంచాయితీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దశాబ్దాలుగా టీడీపీ వర్గీయుల చేతిలో ఉన్న పల్లెల్లోకూడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయాలు సాధించారు. మొదటి విడత కంటే మరింత మెరుగ్గా రెండో విడత ఫలితాలు కనిపిస్తున్నాయి'' అన్నారు. 

read more   కొడాలి నానిపై కేసు: ఎస్ఈసీ ఆదేశాలు అందలేదన్న కృష్ణా జిల్లా ఎస్పీ

''వైఎస్సార్‌సీపీ విజయాన్ని తట్టుకోలేక టీడీపీ కొన్నిచోట్ల హింసను ప్రేరేపించడానికి, గొడవలు చేయడానికి ప్రయత్నించింది. అయినా ప్రజలు జగన్‌ సంక్షేమ పాలనకు తమ ఓటుతో పట్టం కట్టారు. ఇంత చావుదెబ్బతిన్నా చంద్రబాబు ప్రచార గిమ్మిక్కులు చేస్తున్నారు. పంచాయతీల్లో గెలిచిన వైయస్సార్‌సీపీ మద్దతుదారుల ఫొటోలు సహా విడుదల మేం విడుదల చేస్తున్నాం'' అని మంత్రి బొత్స తెలిపారు.