మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలు ఇంకా అధికారికంగా అందలేదన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. అధికారిక ఉత్తర్వులు వచ్చాక న్యాయ సలహా తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

కాగా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల కోడ్ నిబంధనల్లోని క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, కమిషనర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందున చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read:వివరణ ఇచ్చాక కూడా కేసులా: నిమ్మగడ్డపై నాని సీరియస్, ప్రివిలేజ్ నోటీస్‌కు రెడీ..?

రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు.

చంద్రబాబు చెప్పినట్లు ఎస్ఈసీ నడుస్తున్నారని.. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబును, నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి పంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.