జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్‌పై రష్యాలో ఫైల్ ఓపెన్ అయ్యిందని.. మోడీ, అమిత్ షాల కాళ్లు పట్టుకున్నా క్లోజ్ కాదంటూ మంత్రి వ్యాఖ్యానించారు. 

తనకు ప్రాణహానీ వుందంటూ పవన్ కల్యాణ్ అంటున్న మాటలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నిజంగా ప్రాణహానీ వుంటే.. పోలీస్ స్టేషన్‌లో కంప్లయంట్ ఇచ్చి, సాక్ష్యాధారాలు సమర్పించాలని మంత్రి సూచించారు. ప్రాణహానీ లేకున్నా.. ఉందని చెబుతున్న పవన్‌పై చర్యలు తీసుకుంటామని రాంబాబు హెచ్చరించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఢిల్లీలో ఫైల్ ఓపెన్ అయ్యిందని పవన్ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌పై రష్యాలో ఫైల్ ఓపెన్ అయ్యిందని.. మోడీ, అమిత్ షాల కాళ్లు పట్టుకున్నా రష్యాలో ఫైల్ క్లోజ్ కాదన్నారు. 

దిగజారుడు రాజకీయాలు చేయొద్దని.. ఒకవేళ నిజంగా ప్రాణహానీ వుంటే కాపాడాల్సిన బాధ్యత మాపై వుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 2009 నుంచి సరిగ్గా రాజకీయాల్లో వుంటే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదన్న పవన్ వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు. 2009లో ప్రజారాజ్యంలోనే వున్నావుగా అంటూ చురకలంటించారు. చేగువేరా స్పూర్తితో వున్నానని అంటున్నావ్ .. పిరికిపిందిలా మాట్లాడుతున్నావంటూ రాంబాబు ఫైర్ అయ్యారు. పవన్‌ను నమ్మి మోసపోవద్దని జనసైనికులకు, వీర మహిళలకు, యువతకు అంబటి విజ్ఞప్తి చేశారు. 

ALso Read: ఇప్పుడు చెప్పులే పోయాయి .. రేపు బట్టలు కూడా పోతాయ్ : పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు

పవన్ కల్యాణ్ మాటలు వింటే పిల్లలు చెడిపోతారని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ చెప్పులు దొరికితే ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఒక చెప్పు బీజేపీ ఆఫీసులో, మరొకటి టీడీపీ కార్యాలయంలో వుందని రాంబాబు సెటైర్లు వేశారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం అండ చూసుకుని ఎన్నో చేశారని రాంబాబు ఆరోపించారు. రామోజీరావుపై దర్యాప్తు జరుగుతుంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఎందుకు కాలిందంటూ ఆయన దుయ్యబట్టారు. చట్టపరంగానే రామోజీరావుపై చర్యలు తీసుకుంటామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని , టీడీపీ కాదని బీజేపీ చెప్పుకోవడానికి తాపత్రయపడుతోందన్నారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా జగన్ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని రాంబాబు స్పష్టం చేశారు.