ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై గతనెలలో జరిగిన దాడిపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ కాస్త ఆలస్యంగా స్పందించారు.
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై గతనెలలో జరిగిన దాడిపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ కాస్త ఆలస్యంగా స్పందించారు. టీడీపీ నేత కొలిమి ఉసేన్ వలి నివాసంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆమె చెప్పారు. ఇలా పరికిపంద చర్యలను తమ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. అనంతరం చంద్రబాబు గురించి మాట్లాడుతూ... దేశ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారన్నారు. వామపక్షాలు సైతం సీఎంకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
బీజేపీని వ్యతిరేకిస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు అని అఖిలప్రియ అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని వైసీపీ నేతలు చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. తిత్లీ తుఫాను ప్రభావంతో ప్రజలు అల్లాడుతోంటే.. కనీసం జగన్ వారిని పరామర్శించలేదని విమర్శించారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
మరిన్ని వార్తలు చదవండి
జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?
జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ
జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ
శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్
శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా
