Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ లెటర్స్ తో నాకు సంబంధం లేదు.. 3 రాజధానులపై చిరంజీవి క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మూడు రాజధానుల అంశాల హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమరావతితో పాటు విశాఖ పట్నం, కర్నూలు కూడా రాజధానులుగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.

Megastar Chiranjeevi once again responds on 3 capital in Andhra Pradesh
Author
Hyderabad, First Published Dec 23, 2019, 7:44 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మూడు రాజధానుల అంశాల హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమరావతితో పాటు విశాఖ పట్నం, కర్నూలు కూడా రాజధానులుగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. జగన్ ప్రకటనపై మిశ్రమ స్పందన వస్తోంది. రాయలసీమ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తుండగా.. అమరావతి ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

అమరావతిని కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచుతూ.. వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ ని జ్యుడీషియల్ క్యాపిటల్ గా మార్చాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. దీనిపై అమరావతిలో రైతులు, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. 

మెగా వార్: అన్న కంటే తమ్ముడే ఎక్కువ...తేల్చేసిన నాగబాబు

మూడురాజధానుల అంశంపై సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి శనివారం రోజు చేసిన ప్రకటన ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. కొంత కాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయ్యారు. ఊహించని విధంగా ఏపీ రాజధానుల అంశంపై చిరంజీవి ప్రకటన చేశారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల  నిర్ణయానికి తన మద్దతు ప్రకటిస్తున్నట్లు చిరంజీవి ఓ లేఖ విడుదల చేశారు. 

‘‘మెగా’’ కన్‌ఫ్యూజన్: జగన్‌కి జై కొట్టిన చిరు.. 4 బిల్డింగ్‌లతో అభివృద్ధి కాదన్న పవన్

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. భారీస్థాయిలో అమరావతిలో మాత్రమే రాజధాని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మరింతగా వెనకబడుతాయి. కాబట్టి మూడురాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి అని చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై

అయితే ఆదివారం రోజు చిరంజీవి పేరిట మరో లెటర్ వైరల్ అయింది. అందులో మూడురాజధానులకు తాను వ్యతిరేకం అని చిరంజీవి పేర్కొన్నట్లుగా ఉంది.  దీనిపై చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను మూడురాజధానలకు మద్దతుగా శనివారం చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ తో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. 

జగన్ మూడు రాజదానులు: పవన్ కల్యాణ్, నాగబాబులకు చిరంజీవి షాక్

చిరంజీవి చేసిన ప్రకటన తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని, ఇతర విపక్షాలని ఇరుకున పెట్టే అంశనే అని చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios