Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయంపై మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి స్వాగతించారు. 

Former Union minister Chiranjeevi Supports Three capital cities decision
Author
Amaravathi, First Published Dec 21, 2019, 3:41 PM IST

హైదరాబాద్: ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి స్వాగతించాడు.శనివారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మాజీ కేంద్ర మంత్రి జగన్‌కు లేఖ రాశారు. మూడు రాజధానులను స్వాగతిస్తూ లేఖ రాశారు

Also read: రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...

ఏపీకి మూడు రాజధానుల అంశంపై కేంద్ర మాజీ మంత్రి  చిరంజీవి స్వాగతించాడు. చిరంజీవి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. ఏపికి మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి సోదరుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Also read:రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత

అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాద్యమేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు.

Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు

మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ కూడ స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  అమరావతిని అభివృద్ది చేస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలో కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మూడు రాజధానులపై ఉన్న అపోహలు, అపార్థాలను ప్రభుత్వం వెంటనే తొలగించే ప్రయత్నం చేయాలని చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు.

Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు

అసెంబ్లీలో మూడు రాజధానులు ఏపీకి ఉండే అవకాశం ఉందని జగన్ అసెంబ్లీలో ప్రకటించిన  రోజునే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  మండిపడ్డారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 

ఏపీ రాజధాని విషయమై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ  డిసెంబర్ 20వ తేదీన ఏపీ సీఎం జగన్ కు రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఇచ్చిన మరునాడే బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదికను ఇచ్చింది. ఈ విషయాలపై జనవరిలో ఏపీ ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించే అవకాశం ఉంది.

అఖిలపక్షం తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఏపీకి మూడు రాజధానులు వద్దని అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన 29 గ్రామాల ప్రజలు  మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.అమరావతి నుండి రాజధానిని తరలించకూడదని అమరావతికి చెందిన రైతులు కోరుతున్నారు.  

గతంలో అభివృద్ధి, పాలన కేవలం హైద్రాబాద్‌కే పరిమితమైందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాలని చిరంజీవి సీఎం జగన్ కు సూచించారు.లక్షకోట్లతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆందోళన ఉందని చిరంజీవి చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios