Asianet News TeluguAsianet News Telugu

మెగా వార్: అన్న కంటే తమ్ముడే ఎక్కువ...తేల్చేసిన నాగబాబు

కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది నాగబాబు పరిస్థితి.  ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు. ఏ మాట కూడా గట్టిగా అనలేక ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఒక చిన్న యుట్యూబ్ వీడియో విడుదల చేసి అలా సైలెంట్ గా కూర్చున్నాడు ఈ మెగా బ్రదర్. 

nagababu chooses pawan kalyan over chiranjeevi
Author
Hyderabad, First Published Dec 22, 2019, 4:44 PM IST

కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది నాగబాబు పరిస్థితి.  ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు. ఏ మాట కూడా గట్టిగా అనలేక ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఒక చిన్న యుట్యూబ్ వీడియో విడుదల చేసి అలా సైలెంట్ గా కూర్చున్నాడు ఈ మెగా బ్రదర్. 

అంత కష్టాలేమొచ్చాయి నాగబాబుకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నాగబాబును చూస్తుంటే మాత్రం ఎంతటి సంకటంలో పడ్డారో మనకు అర్థమైపోతుంది. ఒక రకంగా జాలేస్తుంది కూడా. 

Also read: AP capital: ఏపీకి 3 రాజధానులు: జగన్ నిర్ణయం వెనకున్నది ఈయనేనా?

దానికి కారణం కూడా లేకపోలేదు. ఒక రకంగా రాజకీయాలకు దూరమయ్యాక చాలా రోజులుగా సినిమాలు తప్ప మరో ధ్యాసే లేకుండా గడిపారు చిరంజీవి. ఉన్నట్లుండి నిన్న హఠాత్తుగా మూడు రాజధానుల విషయంలో మాట్లాడాడు. 

మాట్లాడిన వాడు ఏదో పైపైన మాట్లాడి ఊరుకోకుండా తన తమ్ముడు జనసేన పార్టీ అధినేత అయినా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు. జగన్‌కు ఫుల్ సపోర్ట్ చేసాడు. జగన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నట్టు... ఆయన లేకపోతే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదనే రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించాడు చిరంజీవి.  

మరొపక్కనేమో పవన్ కల్యాణ్ మాత్రం జగన్ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. పవన్ మూడు రాజధానుల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇలాంటి సమయంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్‌కు సపోర్ట్ చేయడంతో కేవలం పవన్ ఒక్కడే కాదు.. ఆయన వెంట ఉన్న నాగబాబుకు కూడా మింగుడుపడటంలేదు. 

ఇప్పుడు నాగబాబుకు ఒక పెద్ద ధర్మసంకటం వచ్చిపడింది. తమ్ముడి వెంట నడవాలో లేదంటే దేవుడైన అన్నయ్యను సపోర్ట్ చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు నాగబాబు. 

ఇప్పటికే జబర్దస్త్ ను వీడదు నాగబాబు. ఇప్పుడు జీతెలుగు లో వస్తున్న ఇలా;అంటి మరో కామెడీ ప్రోగ్రాం కి జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేదా అనే తంటాలు పడుతున్న నాగబాబుకు ఇప్పుడిది ఒక కొత్త సమస్యను తెచ్చి పెట్టింది.  

Also read: రాజధాని విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు...సహకారం అంటూనే జగన్ కి చురకలు

చిరు ప్రెస్ మీట్ విడుదలైన తరువాత కూడా నాగబాబు మాత్రం జై జనసేన అనే అంటున్నాడు. ఇందాకే ఆ విషయమై ఒక వీడియో కూడా విడుదల చేసాడు. కాకపోతే తీవ్రస్థాయిలో విరుచుకుపడకున్నప్పటికీ , ఒక మోస్తరుగా మాత్రం అమరావతి రైతులకు మద్దతు పలికారు. 

ఇలా గనుక చూస్తే అన్న కంటే తమ్ముడికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పటికీ ఎప్పటికీ తన అడుగులు జనసేనతోనే అంటున్నాడు నాగబాబు. రానున్న రోజుల్లో ఈ మెగా డ్రామా ఇంకేమన్నా నూతన మలుపులు తిరుగుతుందేమో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios