‘‘మెగా’’ కన్‌ఫ్యూజన్: జగన్‌కి జై కొట్టిన చిరు.. 4 బిల్డింగ్‌లతో అభివృద్ధి కాదన్న పవన్
భివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలో లేక 4 భవనాలుగానో తాను భావించడం లేదని జనసేనాని వ్యాఖ్యానించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలో లేక 4 భవనాలుగానో తాను భావించడం లేదని జనసేనాని వ్యాఖ్యానించారు.
ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొందని, కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
Also Read:ఏపీకి మూడు రాజధానులు: పవన్ షాకిచ్చిన చిరు, జగన్ జై
మంత్రివర్గ నిర్ణయం తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడమని... అది ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెంపొందించేదిగా ఉండాలని పవన్ పేర్కొన్నారు.
అంతకుముందు ఏపీకి మూడు రాజధానులపై జగన్ ప్రతిపాదనను సినీనటుడు చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా సీఎం చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ సూచించారు.
జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది.ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ జీఎన్ రావుతో పాటు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
పరిపాలన కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించినట్టుగా జీఎన్ రావు కమిటీ తెలిపింది. వరదముంపు లేని ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని సూచించినట్టుగా జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.
Also Read:అమరావతికి జగన్ టోకరా: గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డుల లోగుట్టు ఇదే...
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదికను రూపొందించినట్టుగా కమిటీ తేల్చి చెప్పింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇంకా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడ తాము పరిశీలించినట్టుగా తెలిపింది.
38 వేల మంది వినతులను పరిశీలించినట్టుగాజీఎన్ రావు తెలిపారు. సుమారు 2 వేల మంది రైతులతో తాను ప్రత్యక్షంగా పరిశీలించినట్టుగా జీఎన్ రావు స్పష్టం చేశారు.అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను పరిశీలించినట్టుగా కమిటీ తేల్చి చెప్పింది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం , వేసవి అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.