మచిలీపట్నం: ఇటీవలే పెద్దలను ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లాడిని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె హటాత్తుగా ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడనకు చెందిన దీప్తి, తారకలక్ష్మిసాయి గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ 6 నెలల క్రితమే పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఏమయ్యిందో ఏమోగానీ తాజాగా దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణాకి పాల్పడింది. 

read more   శ్రీశైలం ఘాటు రోడ్డులో ప్రమాదం.. లోయలో పడిన వ్యాన్

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి చేరుకున్న దీప్తి తల్లిదండ్రులు కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త తారక లక్ష్మీసాయి కారకుడంటూ అతడిపై దాడికి పాల్పడ్డారు. 

మృతురాలు దీప్తి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.