భార్యతో చిన్న విషయానికే గొడవ పడ్డాడు. అక్కడితో ఆగకుండా... ఆ కోపం అత్తపై చూపించాడు. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంగటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....  అనంతసాగరం మండలం గౌరవరానికి చెందిన చల్లా లక్ష్మమ్మకి ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఆమెకు కొంతకాలం క్రితం  వివాహం కూడా జరిపించింది. అయితే... ఇటీవల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురైంది. దీంతో... లక్ష్మమ్మను చూడటానికి ఆమె కుమార్తె జయమ్మ... తల్లి వద్దకు వచ్చింది.

Also Read ఏలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని సహజీవనం, చివరకు.....

తల్లికి సేవలు చేస్తూ జయమ్మ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం జయమ్మ భర్త కూడా అదే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఏదో చిన్న విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను సద్దుమణిగించడానికి లక్ష్మమ్మ ప్రయత్నించింది. మా మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చావు అంటూ అత్తమీద కోపంతో ఊగిపోయాడు.

వెంటనే తన బైక్ లోని పెట్రోల్ చేసి అత్త లక్ష్మమ్మ ఒంటిపై పోశాడు. అనంతరం నిప్పు అంటించాడు. కాగా... తీవ్ర గాయాలపాలైన లక్ష్మమ్మను ఆస్పత్రి నిమిత్తం చికిత్స పొందుతోంది.