మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రేమ కోసం ఓ యువకుడు స్నేహితుడిని చంపాడు. పట్టణానికి చెందిన ఓ యువకుడు మృతుడితో స్నేహం నటిస్తూ.. అతని చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపించాడు.

ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలి సోదరుడు వారి ప్రేమకు అడ్డం పడ్డాడు. ఈ విషయంపై స్నేహితుల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తన ప్రేమ వ్యవహారానికి అడ్డం వస్తున్నాడన్న కోపంతో ఆ యువకుడు ప్రియురాలి అన్నను విషం ఇచ్చి హతమార్చాడు.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:

వెంటాడి చంపిన ఘటనలో ట్విస్ట్: యువతితో సహజీవనమే....

గొంతు కోసి భర్తను హత్య చేసిన మహిళ : ఎందుకంటే...