నాగర్ కర్నూలు: తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడింది. కత్తితో గొంతు కోసి మహిళ తన భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా మంగనూరులో జరిగింది. 

మంగనూరుకు చెందిన శ్రీనివాస్ రాత్రి ఆరుబయట నిద్రించాడు. ఎవరూ లేని సమయంలో భార్య అతని గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత మృతుడి చేతిలో కత్తి పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. 

మద్యానికి బానసైన శ్రీనివాస్ గత కొద్ది కాలంగా భార్యతో గొడవ పడుతూ వస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేకనే భర్తను ఆణె హత్య చేసిందని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.