కర్నూల్:అల్లరి చేస్తున్నాడని మూడేళ్ల బాలుడిని విచక్షణ రహితంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన కర్నూల్ పట్టణంలో చోటు చేసుకొంది.

కర్నూల్ నగరంలోని వీవర్ సెక్షన్ కాలనీకి చెందిన ఫరూక్ బేల్దార్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు బెంగుళూరుకు చెందిన వివాహితతో ఫేస్‌బుక్ లో పరిచయం ఏర్పడింది.

వివాహితకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ బాలుడి పేరు జుల్సీ. ఫేస్‌బుక్ పరిచయంతో వివాహిత భర్తను వదిలేసి తన మూడేళ్ల కొడుకును తీసుకొని కర్నూల్ లో నివాసం ఉండే ఫరూఖ్‌ వద్దకు వచ్చింది.

ఫరూఖ్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. ఆదివారం నాడు రాత్రి వివాహిత మూడేళ్ల కొడుకు అల్లరి చేస్తున్నాడని ఫరూఖ్ విపరీతంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు.

Also read:దారుణం:మాంసం వండలేదని కొట్టి చంపాడు

వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్టుగా ప్రకటించారు.  ఈ విషయమై   స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడు ఫరూఖ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

సోషల్ మీడియా కారణంగా మంచితో పాటు చెడు కూడ ఉన్నాయి. అయితే సోషల్ మీడియాను ఎక్కువగా మంచి కోసం కంటే చెడు కోసం ఎక్కువగా ఉపయోగించుకొంటున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు కాపురాలను కూలుస్తున్నాయి. ఈ తరహ సంబంధాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.