వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి.. యువకుడు మృతి..

వాకింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ రావడంతో ఓ యువకుడు ఉన్నట్లుండి మరణించిన ఘటన విజయనగరంలో విషాదం నింపింది. 

man died after collapsing due to a heart attack while walking in vijayanagaram - bsb

విజయనగరం :  ఏపీలోని విజయనగరం జిల్లా రాజాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాకింగ్ కు వెళ్ళిన ఓ యువకుడు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన యువకుడిని శ్రీహరి (28)గా గుర్తించారు. అతను రాజా మండలం మొగిలివలస గ్రామానికి చెందిన వ్యక్తి.

 రోజు ఉదయం వాకింగ్ కు వెళ్లడం అలవాటు. రోజు లాగే ఈరోజు ఉదయం కూడా వాకింగ్ కు వెళ్ళాడు. వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. ఇది గమనించిన అగ్నిమాపక సిబ్బంది శ్రీహరిని  రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించింది.

ఎంపీ రఘురామకు సుప్రీంకోర్టులో భంగపాటు.. పిటిషన్ కొట్టివేత

అక్కడ చికిత్స తీసుకుంటూ యువకుడు మృతి చెందాడు. శ్రీహరి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.  అనుకోకుండా హఠాత్తుగా అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు  కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇదిలా ఉండగా, ఈ నెల 10న ఇలాంటి రెండు ఘటనలు తెలంగాణలో వెలుగు చూశాయి. జూలై 10న ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యాయామం చేసివచ్చిన ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అతను కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ కుమారుడు శ్రీధర్ (31). 

కడుపైనా చేయాలంటాడు: బాలయ్యపై జగన్, "పవన్ లోబరుచుకుని వదిలేస్తాడు"

ఇటీవలి కాలంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.ఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. జూలై 9న ఖమ్మం నగరం, అల్లిపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. తాజాగా ఖమ్మంలోనే మరో గుండెపోటు మరణం నమోదవడం భయాందోళనలు కలిగిస్తుంది. పదో తేదీ ఉదయం జిమ్ కు వెళ్లి వచ్చిన కాసేపటికే శ్రీధర్ ఛాతిలో నొప్పి వస్తుందంటూ ఇంట్లో వారికి తెలిపాడు.

వెంటనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు శ్రీధర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన శ్రీధర్ ని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు  ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. క్షణాల్లో కళ్లముందే మృతి చెందడంతో తీవ్రంగా విలపిస్తున్నారు.

అంతకుముందు రోజే వారింట్లో ఓ శుభకార్యం జరిగింది.  శ్రీధర్ సోదరుడు కొడుకుకి బాలసార చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా హాజరయ్యారు. రాధా కిషోర్ రేణుక చౌదరికి ముఖ్య అనుచరుడు. కాగా, వరుసగా రెండు రోజులు ఇద్దరు యువకులు, ఖమ్మంలో మృతి చెందడంతో  స్థానికంగా విషాదం నెలకొంది.  కొడుకు మృతి చెందిన విషయం తెలిసి...రాధా కిషోర్ ను పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios