Asianet News TeluguAsianet News Telugu

కడుపైనా చేయాలంటాడు: బాలయ్యపై జగన్, "పవన్ లోబరుచుకుని వదిలేస్తాడు"

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు  ఆయన కౌంటరిచ్చారు.  పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు

AP CM YS Jagan Responds  On  Pawan Kalyan Comments Over Volunteer lns
Author
First Published Jul 21, 2023, 12:13 PM IST

నెల్లూరు:  అమ్మాయిలను లోబర్చుకొనిపెళ్లి చేసుకోవడం, కాపురం చేసి వదిలేయడం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అని   ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి  మాట్లాడేది ఆయన ప్రశ్నించారు.

నెల్లూరులో  నేతన్న నేస్తం కింద  శుక్రవారంనాడు నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన  పవన్ కళ్యాణ్ కు కౌంటరిచ్చారు. వాలంటీర్లపై ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  ఆయన మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు  దోహదపడుతున్నారని పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై  సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 

ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి  వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారని  సీఎం జగన్   ఆగ్రహం వ్యక్తం  చేశారు.  ఒకడిదేమో  బాబుతో పొత్తు... బీజేపీతో కాపురం అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు జగన్.వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో  సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసునని జగన్ చెప్పారు. వాలంటీర్లపై తప్పుడు మాటలకు నిర్మాత చంద్రబాబైతే, మాటలు, డైలాగ్ లు, నటనంతా దత్తపుత్రుడిదని ఏపీ సీఎం వైఎస్ జగన్  కౌంటరిచ్చారు.

 వాలంటీర్ల క్యారెక్టర్లను  తప్పుబట్టిన చంద్రబాబుకు  పదేళ్లుగా  వాలంటీర్ గా  ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని  ఆయన  ఎద్దేవా చేశారు.  క్యారెక్టర్ లేని వాళ్లంతా  వాలంటీర్ల గురించి మాట్లాడుతారా అని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సీఎం జగన్.నాలుగేళ్లకో పెళ్లి చేసుకునేవాడు వాలంటీర్లను విమర్శిస్తున్నాడని  పవన్ కళ్యాణ్ పై  వైఎస్ జగన్ మండిపడ్డారు.

హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు బాలకృష్ణ పై కూడ  జగన్ మండిపడ్డారు. అమ్మాయిలు కన్పిస్తే ముద్దైనా పెట్టాలంటాడు,  కడపైనా చేయాలని  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి వాళ్లు  వాలంటీర్ల గురించి  విమర్శలు చేస్తున్నారని  బాలకృష్ణపై విమర్శలు చేశారు.

మంచి చేస్తున్న  వాలంటీర్ల గురించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని  సీఎం జగన్ చెప్పారు.   వాలంటీర్లపై తప్పుడు మాటలు  మాట్లాడుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.  

అవినీతి, వివక్ష తెలియని  మంచివాళ్లు వాలంటీర్లు అని సీఎం జగన్  చెప్పారు.  వాలంటీర్లపై తప్పుడు మాటలకు నిర్మాత చంద్రబాబైతే, మాటలు, డైలాగ్ లు, నటనంతా దత్తపుత్రుడిదని ఏపీ సీఎం వైఎస్ జగన్  కౌంటరిచ్చారు.

చంద్రబాబు, దత్తపుత్రుడు, స్వంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసునని జగన్ చెప్పారు. మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని  నిస్సిగ్గుగా  ఒకరంటున్నారన్నారు.  వాలంటీర్లపై  అన్యాయంగా బురద చల్లుతున్నారన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios