తాగిన మైకంలో పురుషాంగాన్ని కోసుకున్న యువకుడు

Man 'chopped off his penis with  knife  in drunken row
Highlights

అనంతపురం జిల్లాలో ఓ యువకుడి నిర్వాకం

మద్యం మత్తులో ఆ యువకుడు ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన అవయాలను తానే కోసుకుని గాయపర్చుకున్నాడు.  ఏకంగా పురుషాంగాన్ని కోసుకుని, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

 ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాయదుర్గం ప్రాంతానికి చెందిన గోవిందరాజు హోటల్ లో పనిచేస్తుంటాడు. తన కుటుంబంతో కలిసి  గొందిబావి ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే వేసవి సెలవులు ఉండటం భార్య సిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఎవరూ లేక గోవింద్ ఒంటరిగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో నిన్న ఇతడు ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి  చేరుకున్నాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలీక కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. అయితే ఈ నొప్పి భరించలేక కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గోవింద్ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.     

loader