దేశంలోనే తొలి ‘రోబో’ రెస్టారెంటు

దేశంలోనే తొలి ‘రోబో’ రెస్టారెంటు

తమిళనాడులో రోబో రెస్టారెంటు ప్రారంభమైంది. చెన్నై ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో రోబో థీమ్ రెస్టారెంటును ఇద్దరు యువకులు ప్రారంభించారు. ఇదే రెస్టారెంటు చాలా కాలంగా నడుస్తున్నా రోబో థీమ్ తో సరికొత్తగా ప్రారంభించారు. రెస్టారెంటుకు వచ్చిన అతిధులు ఇచ్చిన ఆర్డర్ రెడీ అవ్వగానే సదరు ఆర్డర్ ను రోబోలే సర్వ్ చేస్తున్నాయ్. ఈ తరహా రోబో సర్వర్లు ప్రస్తుతం జపాన్, అమెరికా, యూరోప్ లోని కొన్ని దేశాలతో పాటు బంగ్లాదేశ్ లో ఉన్నాయి. కాగా మహాబలిపురం రోడ్డులో స్టార్ట్ చేసిన రోబో రెస్టారెంటే దేశంలో తొలి రెస్టారెంట్ అనే చెప్పాలి. వెంకటేష్ రాజేంద్రన్, కార్తీక్ కన్నన్ అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఈ రెస్టారెంటును ప్రారంభించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos