నెల్లూరు జిల్లా టిడిపి ఉదయగిరి ఎంఎల్ఏ బొల్లినేని రామారావు పై మరో కేసు నమోదైంది.

నెల్లూరు జిల్లా టిడిపి ఉదయగిరి ఎంఎల్ఏ బొల్లినేని రామారావు పై మరో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఎంఎల్ఏకు చెందిన కాంట్రాక్టు సంస్ధ వంద కోట్ల మేరకు అవినీతికి పాల్పడినట్లు రుజువుకావటంతో ఎంఎల్ఏపై గతంలోనే కేసు పెట్టారు. కార్పొరేషన్ పరిధిలో చేసిన కాంట్రాక్టు పనుల్లో బొల్లినేని కంపెనీ అవినీతికి పాల్పడినట్లు ఎసిబి విచారణలో బయటపడింది. ఏసిబి చేసిన విచారణలో తాజాగా మరో కేసు కూడా పెట్టినట్లు సమాచారం. సరే, పట్టుబడిన తర్వాత తానెటువంటి అక్రమాలకు పాల్పడలేదని అందరూ చెప్పినట్లే బొల్లినేని కూడా చెబుతున్నారు లేండి. అయితే, తాజాగా పెట్టిన విషయంలోనే ఇపుడు బొల్లినేని అరెస్టుకు రంగం సిద్దమైందట.