విజయవాడ: తమ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మగాడిలా మాట్లాడాడని తెలుగుదేశం పార్టీ నేత మాగంటి బాబు అన్నారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలనే మాట  దైర్యంగా చెప్పిన వ్యక్తి జేసీ అని ఆయన అన్నారు.  రైతులు 28 రోజుల నుండి దీక్షలు చేస్తుంటే జేసీలా ఎవరైనా ఓపెన్ గా మాట్లాడారా అని ఆయన అడిగారు. 

రాయసీమ పులి జేసీ దివాకర్ రెడ్డి అని ఆయన అన్నారు. అమరావతి వెళ్లాలని గత పది రోజులుగా జేసీ పట్టుబట్టినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఏడాది, ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన అన్నారు. వైఎస్ జగన్ నమ్మకాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. 

Also Read: కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

కుల ద్వేషం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.సీఎం అవుతూనే వైఎస్ గన్ రాజధానినే మార్చాలని అనుకున్నారని ఆయన అన్నారు. జగన్.కృష్ణా-గోదావరి నదుల వల్లే ఈ ప్రాంతంలో డబ్బు ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.మెజార్టీ భూములు కొని ఉండొచ్చేమో కానీ.. కమ్మ వాళ్లు మాత్రమే భూములు కొనలేదని అన్నారు. గత ఏడు నెలల కాలంగా విజయ సాయి ఢిల్లీ-విశాఖ మధ్య తిరిగారని ఆయన అన్నారు. 

డబ్బులున్న వాళ్లొచ్చి భూములు కొంటే.. రైతులకేం నష్టమని అన్నారు.ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుతున్నారని.గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేశారని జేసీ అన్నారు. కేసీఆర్ విషయంలో జగన్ గురు భక్తి చాటుకున్నారని అన్నారు. మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగన్ కు చెప్పారట అని జేసీ అన్నారు. .ఏపీలోని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని అన్నారు. ఏపీపై నమ్మకం.. విశ్వాసం పోయిందని, అందుకే పరిశ్రమలు పోయాయని అన్నారు.

Also Read: ఏడాది, ఏడాదిన్నరలో సీఎంగా వైఎస్ భారతి: జెసి సంచలనం

వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు గత 29 రోజులు అమరావతిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ వారు ఆందోళన చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. సంక్రాంతి పర్వదినం రోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితో కలిసి అమరావతిలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.